కూలిన కాంగ్రెస్ ప్రచార వేదిక.. పరుగెత్తిన నేతలు

Fri,October 12, 2018 07:06 PM

Stage collapse during Congress Election campaign in Achampet

మహబూబ్‌నగర్: అచ్చంపేట కాంగ్రెస్ సభలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రచార వేదికపైకి పరిమితికి మించి ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా భారీగా తరలిరావడంతో ప్రమాదం జరిగింది. వేదిక కూలిన ఘటనలో కాంగ్రెస్ నేతలు సురక్షితంగానే బయటపడ్డారు. ప్రచారసభకు హాజరైన వారిలో విజయశాంతి, భట్టివిక్రమార్క, నంది ఎల్లయ్య తదితరులు ఉన్నారు. నేతలంతా అత్యుత్సాహం చూపడంతో స్టేజీ ఒక పక్కకు ఒరిగింది. వేదిక కుప్పకూలడంతో నేతలంతా భయంతో పరుగులు తీశారు. అయోమయం నుంచి తేరుకున్న తర్వాత సభను రద్దు చేసుకొని నాయకులంతా ఇంటిముఖం పట్టారు.

2464
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles