ఎస్సారెస్పీ నీటి విడుదలపై జూలైలో ప్రణాళిక

Mon,June 17, 2019 09:01 PM

SRSP water release Planned in July

తిమ్మాపూర్ : ఆశించిన స్థాయిలో వర్షాలు కురిస్తే వచ్చే నెల మొదటి వారంలో ఎస్సారెస్పీ నీటి విడుదలపై హైదరాబాద్‌లో ఈఎన్‌సీ ఆధ్వర్యంలో స్టేట్ లెవల్ కమిటీ ఇంటిగ్రేటెడ్ వాటర్ మేనేజ్‌మెంట్(శివం)లో ప్రణాళికలు రూపొందిస్తామని ఎస్సారెస్పీ చీఫ్ ఇంజినీర్ శంకర్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని ఎస్సారెస్పీ సీఈ కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీలో ఆశించిన స్థాయిలో నీరు లేదనీ, వర్షాలు సమృద్ధిగా పడి ప్రాజెక్టులోకి నీరు చేరితే ఖరీఫ్ యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామన్నారు. ఎస్సారెస్పీ, ఎల్‌ఎండీ పరిధిలో ప్రస్తుతం 808 తూముల నిర్మాణం చేపడుతున్నామనీ, వీటి ద్వారా గ్రామాల్లోని చెరువులు, కుంటలకు నీటిని అందిస్తామని తెలిపారు. పోచంపాడ్‌లోని ఎస్సారెస్పీలో 5.66 టీఎంసీల నీరు, ఎల్‌ఎండీలో 3.722 టీఎంసీల నీరు ఉందని చెప్పారు. మిషన్ భగీరథకు నీటి కొరత లేదని స్పష్టం చేశారు.

2024
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles