శ్రీశైలం జలాశయానికి మరింత తగ్గిన వరద

Sun,August 25, 2019 10:39 AM

శ్రీశైలం: శ్రీశైలం జలాశయానికి వరద మరింత తగ్గింది. 22,050 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. జలాశయం నుంచి 56,209 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 882.70 అడుగుల నీటిమట్టం ఉంది. ప్రాజెక్టు పూర్థిస్థాయి సమర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 202 టీఎంసీల నీటి నిలువ ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 31,783 క్యూసెక్కులు, కల్వకూర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 2400 క్యూసెక్కులు, హంద్రీనీవాకు 2026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles