ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లోTue,November 14, 2017 09:34 PM
ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న ఇన్‌ఫ్లో

మెండోరా : నిజాంసాగర్ నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతుండడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 13వేల150 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందని ఏఈఈ మహేందర్ తెలిపారు. ప్రధాన కాలువ కాకతీయ నుంచి 6 వేల క్యూసెక్కులు, లక్ష్మి కాలువకు 100 క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు (90టీఎంసీలు) కాగా సాయంత్రానికి 1079.40అడుగులు (50.779 టీఎంసీల) నీటి నిల్వ ఉంది.

449
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS