రేపు యాదాద్రిలో శ్రావణ శ్రీలక్ష్మీవ్రతము

Thu,September 6, 2018 08:50 PM

sravana sri laxmi vratam at yadagirigutta temple

యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో శుక్రవారం శ్రీలక్ష్మీవ్రతం(వరలక్ష్మీవ్రతం)ను శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో యాదాద్రికొండపైన ఉన్న పుష్కరిణి వద్ద గల నిర్మిస్తున్న వ్రత మండప ప్రాంగణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్.గీత గురువారం తెలిపారు. శ్రావణమాసంలో వచ్చే శ్రీలక్ష్మీవ్రతం అనాధిగా హిందూ స్త్రీలు నిర్వహించుకునే విశేషమైన వ్రతమన్నారు.

ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా శ్రీలక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే అతి ముఖ్యమైన భక్తిపూర్వక పూజా కార్యక్రమమని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకుని నిర్వహించుకోవడం ప్రతి ఒక్కరికి సాధ్యంకాదనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా ముత్తైదువులందరికి శ్రావణ వరలక్ష్మి సామూహిక శుక్రవార వ్రతాన్ని శుక్రవారం 10:30 గంటలకు కొండపైన పుష్కరిణి సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక ద్వారా ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

వ్రతంలో పాల్గొనాల్సిన మహిళలు తమ పేర్లను దేవస్ధానం శాశ్వతపూజలు - అన్నదానం కార్యాలయంలో నమోదు చేసుకున్నారని తెలిపారు. వ్రతంలో పాల్గొనే వారికి ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండా ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి దేవస్థానం తరపున ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

1547
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS