శ్రావణం.. శుభప్రదం..పూజలకు పవిత్ర మాసం

Sun,August 12, 2018 11:39 AM

Sravana masam starts on August 12   to September 9

న్యూశాయంపేట:శ్రావణమాసం పవిత్ర మాసం. పండుగలను మన ఇంటికి తీసుకువచ్చే మాసం. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు, ఆచారాలకు అనుగుణంగా ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేకత ఉంది. అందులో శుభప్రదమైనది శ్రావణ మాసం. ఎంతో ప్రాశస్త్యం ఉన్నది. ఎన్నో పండుగలు, పర్వదినాలు కలబోసుకున్న మాసం. వేధద్యాయిని ప్రారంభించే మాసం.. బలిచక్రవర్తికి పట్టాభిషేం జరిగిన మాసం.. స్వయంభూకు పట్టాభిషేకం జరిగిన మాసం.. ఎన్నో శుభకార్యాలు ప్రారంభించే మాసం శ్రావణం.

ముఖ్యమైన రోజులు

శ్రావణ మాసాన్ని మహిళలు అతి పవిత్రంగా భావిస్తారు. అందులో నాలుగు సోమవారాలు, నాలుగు మంగళవారాలు, నాలుగు శుక్రవారాలు, నాలుగు శనివారాలను పవిత్రంగా భావించి వ్రతాలు, పూజలు చేస్తారు. దేవాలయాల్లో కూడా పూజలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.

వరలక్ష్మీ వ్రతం(24వ తేదీ)

శ్రావణ మాసంలోని శుక్రవారాల్లో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఎంతో పవిత్రమైంది. ఆ రోజు మహిళలు వరలక్ష్మీ వ్ర తం అచరిస్తారు. ఈ వ్రతం నియమ నిష్టల తో చేసినవారికి ధనకనక వస్తు వాహనాలకు ఏవిధమైన లోటు ఉండదని విశ్వాసం. చారుమతి మహాలక్ష్మి ఉపదేశాన్ని పొంది ఈ వ్ర తాన్ని ప్రచారంలోకి తెచ్చిందని నమ్ముతారు.

నాగపంచమి (15వ తేదీ)

శ్రావణ శుద్ద పంచమి నాడు నాగపంచమి పండుగ జరుపుకుంటారు. హిందువులు నాగపూజ (సర్పపూజ) తరతరాలుగా ఆచరిస్తున్నారు. పంచమి నాగులకు ప్రీతికరమైనరోజు కనుక తెలంగాణ రాష్ట్రంలో పంచమి నాడు ఈ పండుగ జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్తీక చతుర్థినాడు, మార్గశి శుక్ల పంచమి నాడు నాగపంచమిగా భావించి పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దీనిని గరుడ పంచమిగా వ్యవహరిస్తారు. ఈ రోజు మహిళలు పుట్టలకు పాలు పోసి పూజలు చేస్తారు. నాగుల ప్రీతిని సంపాదించడానికి ఈ పూజ చేయడం భారతదేశంలో అనవాయితీగా వస్తుంది.

రాఖీ పౌర్ణమి (26వ తేదీ)

శ్రావణ శుద్ద పూర్ణిమ నాడు రాఖీ పండుగ జరుపుకుంటారు. సోదర సోదరీ ప్రేమను వ్యక్తం చేసే పండుగల్లో ఇది చాలా ముఖ్యమైన పండుగ. ఈ రోజు సోదరులకు తోబుట్టువులు ఉదయాన్నే ముంజేతికి రాఖీ కడతారు. రాఖీ అంటే తోరము. అందువల్లే ఈ పం డుగకు రాఖీ పూర్ణిమ అని పేరు వచ్చింది. తోరమును పట్టు దారంతోగాని, నూలు దారంతో గాని చేస్తారు. ఇలా కట్టడాన్ని రక్షాబంధన్ అని కూడా అంటారు. సోదరులు తరువాత సోదరిలకు కానుకలు సమర్పించి కాళ్లకు దడ్డం పెట్టి దీవించమని కోరుతారు.

శ్రీకృష్ణాష్టమి ( సెప్టెంబర్ 2,3 తేదీలు)

శ్రావణ కృష్ణ బహుళ అష్టమి నాడు కృష్ణాష్టమి పండుగ జరుపుకుంటారు. శ్రీకృష్ణుడి జన్మదినం కావడంతో జన్మాష్టమి అని, చిన్నతనంలో కృష్ణుడు గోకులంలో పెరిగాడు కనుక దీనిని గోకులాష్టమని, కృష్ణాష్టమిని కృష్ణ జయంతి, శ్రీజయంతి అని కూడా పిలుస్తారు. బాల్యంలో శ్రీకృష్ణుడు యాదవుల ఇళ్లలో పెరిగి పాలు, పెరుగు, వెన్న దొంగిలించిన చిలిపి చేష్టలకు నిదర్శనంగా వీధుల్లో ఉట్లు కొట్టడం ఆనవాయితీగా మారింది.

పొలాల అమావాస్య (సెప్టెంబర్ 9న)

శ్రావణ కృష్ణ అమావాస్య రోజును పొలాల అమావాస్యగా పిలుస్తారు. ఈ అమావాస్యకి గోదారి పొర్లి-పొర్లి వస్తుందంటారు. ఈ అమావాస్యకు తెలుగు రాష్ర్టాల్లో పొలాంబ అనే దేవతను పూజిస్తారు. పోలాంబ కాలక్రమంలో పోలేరమ్మగా మారిందని అంటారు.

4077
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles