డ్రోన్‌తో పురుగుమందుల పిచికారి

Fri,February 22, 2019 07:59 AM

Spray pesticide with drone in jayashankar agriculture university

హైదరాబాద్: డ్రోన్ ద్వారా పురుగుమందులు పిచికారి చేయడంపై గురువారం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ పరిశోధన కేంద్రం క్షేత్రంలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. సెన్స్‌ఏకర్ సంస్థ సహకారంతో ప్రదర్శన ఏర్పాటుచేశారు. పదిలీటర్ల సామర్థ్యం ఉన్న ట్యాంకును డ్రోన్‌కు అమర్చి రిమోట్ సహాయంతో జీపీఎస్, జీఐఎస్ పరిజ్ఞానం ఉపయోగించి వరిపంటపై పిచికారిచేశారు. పంట ఎత్తునుబట్టి ఎంత ఎత్తులో డ్రోన్ ద్వారా పిచికారిచేయాలి, ఎంత పురుగుమందు వాడాలనే అంశాలను పరిశీలించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ ఆర్ జగదీశ్వర్, వరి పరిశోధన కేంద్రం హెడ్ డాక్టర్ ప్రదీప్, వరి, ప్లాంట్ పొటెక్షన్ విభాగాల శాస్త్రవేత్తలు, యూజీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులు, అధ్యాపకులు ప్రదర్శనను పరిశీలించారు.

1335
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles