తెలుగు వర్సిటీలో పీజీ కోర్సులకు తక్షణ ప్రవేశాలు

Fri,September 21, 2018 07:37 AM

spot admissions for PG Courses in Telugu University

హైదరాబాద్ : పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018-19 విద్యా సంవత్సరానికి ఎంఏ(తెలుగు), ఎంఏ(లింగ్విస్టిక్), ఎంఏ(కమ్యూనికేషన్, జర్నలిజం) కోర్సులకు కామన్ ఎంట్రన్స్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించడం జరిగిందని రిజిస్ట్రార్ అలేఖ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పై కోర్సులకు ఇప్పటికే ఓయూ కౌన్సెలింగ్ నిర్వహించి విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని, అయినప్పటికీ ఇంకా కొన్ని సీట్లు నింపవలసి ఉన్నందున ఈ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు చివరి అవకాశంగా తక్షణ ప్రవేశాన్ని(స్పాట్ అడ్మిషన్) తెలుగువర్సిటీ కమిటీ హాల్‌లో ఈ నెల 25న ఉదయం నిర్వహించడం జరుగుతుందని ఆమె వెల్లడించారు. పై అంశాలలో ఓయూ సెట్‌లో ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తక్షణ ప్రవేశానికి అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్‌లతో స్వయంగా హాజరై రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా రిజి్రస్ట్రార్ కోరారు.

1946
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles