29 నుంచి క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి ఎంపికలు

Sat,June 15, 2019 12:49 PM

sports school admission in telangana

హైదరాబాద్ : తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హకీంపేట్‌లో నిర్వహిస్తున్న క్రీడా పాఠశాలలో 4వ తరగతిలో ప్రవేశం కోసం ఈనెల 29వ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు అన్ని జిల్లాల యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలో పాల్గొనే క్రీడాకారులు 3వ తరగతి ఉత్తీర్ణులై 08 సంవత్సరాల వయస్సు గల వారై 01-09-2010 నుంచి 31-08-2011 మధ్య జన్మించి ఉండాలని 2019-20 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతిలో మాత్రమే ప్రవేశం ఉంటుందన్నారు. ఈ ఎంపిక ప్రక్రియలో విద్యార్థులకు శారీరక సామర్థ్యానికి సంబంధించిన పలు పోటీ పరీక్షలు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎవరైతే ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎక్కువ మార్కులు సాధిస్తారో వారిని జిల్లా స్థాయిలో ఎంపిక చేసి రాష్ట్రస్థాయిలో జరిగే పోటీలకు పంపనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో పాల్గొనే విద్యార్థులు 3వ తరగతి ప్రోగ్రెస్ కార్డు, 4వ తరగతి బోనోఫైడ్, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, 10 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో హాజరు కావాలని పూర్తి వివరాలకు 08452-223676, 9849577141 లకు ఫోన్ చేసి సంప్రదించాలని, జిల్లాలోని ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి తెలిపారు.

1814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles