కాచిగూడ నుంచి నిజామాబాద్‌, కర్నూలుకు ప్రత్యేకరైళ్ళు

Fri,October 18, 2019 10:33 PM

హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి నిజామాబాద్‌, కర్నూలు రైల్వేస్టేషన్లకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్ళను ప్రకటించింది. శనివారం ఉదయం 11 గంటలకు కాచిగూడ నుంచి నిజామాబాద్ కు ప్రత్యేక రైలు బయల్దేరి.. మధ్యాహ్నం 3 గంటలకు అక్కడికి చేరుకుంటుంది. ఇదే రైలు నిజామాబాద్‌లో మధ్యాహ్నం 3:40 గంటలకు బయలుదేరి కాచిగూడకు రాత్రి 7:30 గంటలకు చేరుకుంటుంది.


అదే విధంగా కాచిగూడ నుంచి కర్నూలు మధ్య నడిచే ప్రత్యేక రైలు కాచిగూడ నుంచి శనివారం ఉదయం 11:50 గంటలకు బయలుదేరి సాయంత్రం 4:15 గంటలకు కర్నూలుకు చేరుకుంటుంది. ఇదే రైలు సాయంత్రం 5 గంటలకు బయలుదేరి కాచిగూడకు రాత్రి 9:30 గంటలకు చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్‌ నుంచి బొల్లారం మధ్య నడిచే డెమూ రైలును మేడ్చల్‌ వరకు పొడిగించారు. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.

725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles