దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు

Tue,September 10, 2019 03:02 PM

Special trains for Dussehra Diwali Christmas and New Year

హైదరాబాద్: దసరా, దీపావళి, క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా పలు మార్గాల్లో 78 ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నల్లగొండ, గుంటూరు, విజయనగరం, భువనేశ్వర్ మార్గంలో కాచిగూడ - టాటానగర్, టాటానగర్ - కాచిగూడ మధ్య 26 సర్వీసులు, ఖమ్మం, రయనపాడు, దువ్వాడ, శ్రీకాకుళం, ఖుర్దారోడ్డు మార్గంలో సికింద్రాబాద్ - భువనేశ్వర్, భువనేశ్వర్ - సికింద్రాబాద్ మధ్య 36 సర్వీసులు, నల్లగొండ, గుంటూరు, పాలకొల్లు మార్గంలో నర్సాపూర్ - హైదరాబాద్, మధ్య 4 ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ - విజయవాడ మధ్య 4 సర్వీసులు, మచిలిపట్నం - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - మచిలిపట్నం మధ్య 8 సర్వీసులు రాకపోకలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles