జోగుళాంబ సన్నిధిలో ప్రత్యేక పూజలు

Fri,March 15, 2019 09:38 PM

special prayers in jogulamba temple

అలంపూర్ : శ్రీశైల మహా క్షేత్రానికి పశ్చిమ ద్వార క్షేత్రంగా విరాజిల్లుతున్న అలంపూర్ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో అర్చకులు ఆరుద్రోత్సవం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేఖర భారతి స్వామి వారి విజయ యాత్ర సందర్భంగా అలంపూరు క్షేత్రాన్ని దర్శించిన సమయంలో ఆలయాభివృద్ధి కోసం ప్రతి నెలా ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజున ఆరుద్రోత్సవం నిర్వహించాలని సూచించారు. ఆయన సూచనల మేరకు శివాలయంలో ప్రతి నెల ఆరుద్రోత్సవం నిర్వహిస్తున్నారు. ముందుగా గోమాతకు పూజలు నిర్వహించి ఆలయం చుట్టు ప్రదక్షిణలు చేసి ఆలయంలో శాస్రోక్తంగా గణపతి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాన్యాస పారాయణం, ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు.అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామి వారి మూల విరాట్‌కు అన్నాభిషేకాలు నిర్వహించారు. సంధ్యా సమయంలో జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి శాంతి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో గురురాజా, ఆలయ ముఖ్య అర్చకుడు ఆనంద్ శర్మ, ప్రధాన అర్చకుడు శ్రీకాంత్‌శర్మ, త్యాగరాజ్ శర్మ, ధనుంజయ శర్మ,కిట్టు శర్మ పాల్గొన్నారు.

721
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles