HomeLATEST NEWSspecial gift to minister ktr from sircilla handloom weaver

'ఉరి'సిల్లను 'సిరి'సిల్లగా మార్చిన కేటీఆర్‌కు అరుదైన కానుక

Published: Thu,November 1, 2018 09:39 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
* బతుకమ్మ ప్రతిమ.. కేటీఆర్ పేరుతో శాలువా
* నేడు మంత్రికి అందించనున్న హరిప్రసాద్

రాజన్న సిరిసిల్ల: 'ఉరి'సిల్లను 'సిరి'సిల్లగా మార్చిన అమాత్యుడికి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన హరిప్రసాద్ అరుదైన కానుకను సిద్ధం చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో చావులకు నిలయంగా మారిన సిరిసిల్ల నేత కార్మికుల జీవితాల్లో బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లతో నూతన వెలుగులు నింపిన మంత్రి కేటీఆర్ కోసం తనదైన శైలిలో చేనేత ప్రతిభను ప్రతిబింబించేలా శాలువాను సిద్ధం చేశాడు. తెలంగాణ సాంస్కృతిక పండుగ అయిన బతుకమ్మ ప్రతిమతో పాటుగా వేలాది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పించిన మంత్రి కేటీఆర్ పేరుతో మగ్గంపై శాలువాను తయారుచేశాడు.

సిరిసిల్ల నేత కార్మికుల ఆర్థిక పరిస్థితుల్లో సమూల మార్పులు తెచ్చిన మంత్రి కేటీఆర్‌కు తనవంతు కృతజ్ఞతగా శాలువాను తయారుచేసినట్లు హరిప్రసాద్ చెప్పాడు. పద్మశాలీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో శుక్రవారం (2న) నిర్వహించబోయే కృతజ్ఞత సభ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్‌కు ఈ శాలువాను కానుకగా అందించనున్నట్లు తెలిపాడు. హరిప్రసాద్ ప్రతిభను పలువురు అభినందించారు.
2389
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology