ప్రభుత్వ ఉద్యోగుల సమయపాలన కోసం ప్రత్యేక యాప్‌

Tue,June 11, 2019 10:48 AM

special app for telangana government employer timing

రాష్ట్రంలోనే ములుగు జిల్లా అభివృద్ధ్దిలో ప్రథమ స్థానంలో ఉండాలన్న సీఎం కేసీఆర్ సూచనలు, జిల్లా మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి.. ఉద్యోగుల సమయ పాలన, విధి నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. జిల్లాను మోడల్‌గా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పలు నూతన కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగుల హాజరుశాతం పెంపు కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుశాతం పెరిగినట్లయితే సమస్యల పరిష్కారం, విధుల నిర్వహణపై అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారన్న ఆలోచనతో యూబీఐ షిఫ్ట్ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. జిల్లాలోని కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాల్లో పైలట్‌గా అమలు చేశారు. రేపటి నుంచి జిల్లాలో పూర్తిస్థాయిలో ఈ విధానం అమల్లోకి రానుంది. ఉద్యోగుల విధుల డుమ్మాకు చెక్ పెట్టి, ప్రజలకు పారదర్శక పాలన అందించేందుకు ప్రవేశపెడుతున్న ఈ యాప్ పరిధిలోకి జిల్లావ్యాప్తంగా 2వేల మంది ఉద్యోగులు రానున్నారు. దీని పర్యవేక్షణ బాధ్యతను ఆయా విభాగాల అధిపతులకు అప్పగించారు.

ములుగు : రాష్ట్రంలోనే ములుగు జిల్లా అభివృద్ధ్దిలో ప్రథమ స్థానంలో ఉండాలన్న సీఎం కేసీఆర్ సూచనలు, జిల్లా మంత్రి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణడ్డి.. జిల్లాలోని ఉద్యోగుల సమయ పాలన, విధి నిర్వహణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. జిల్లాను ఒక మోడల్ జిల్లాగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో పలు నూతన కార్యక్రమాలను అమలు చేసే క్రమంలో ఉద్యోగుల హాజరుశాతం పెంపు కోసం కలెక్టర్ ప్రత్యేక కార్యచరణ రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరుశాతం పెరిగినట్లయితే సమస్యల పరిష్కారం, విధుల నిర్వాహణ పట్ల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారనే ఆలోచనల మేరకు.. యూబీఐ షిఫ్ట్ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించారు. ఈ మేరకు ఈ నెల 12 (రేపు) నుంచి ఈ విధానం అమల్లోకి రానుంది.

యూబీఐ షిఫ్ట్‌ద్వారా హాజరు నమోదు


జిల్లాలోని 9 మండలాల పరిధిలో యూబీఐ షిఫ్ట్ యాప్ ను ప్రవేశపెట్టి అన్ని విభాగాలలో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది సమయ పాలనను పర్యవేక్షించనున్నారు. ఈ యాప్ జిల్లాలో ప్రత్యేకంగా కార్యాలయాలు, పాఠశాల్లో పనిచేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయుల సమయ పాలనను క్రమబద్ధ్దీకరించేందుకు జిల్లా కలెక్టర్ ఆలోచనల మేరకు ప్రత్యేకంగా రూపొందించారు. పాఠశాలకు, కార్యాలయానికి హాజరైన సమయంలో యాప్‌ను ఓపెన్ చేసి సెల్ఫీ దిగి టైం ఇన్ చేయడం జరుగుతుంది. కార్యాలయం సమయం పూర్తయిన తర్వాత యాప్ ద్వారా టైం ఔట్ చేస్తారు.

పర్యవేక్షణ బాధ్యత విభాగాధిపతులకు..


జిల్లాలో ఈ నెల 12 నుంచి అమలు కానున్న యూబీఐ షిఫ్ట్‌యాప్‌ను జిల్లా కలెక్టర్‌తో పాటు ఆయా కార్యాలయాల్లోని విభాగాధిపతులు పర్యవేక్షించనున్నారు. ఈ యాప్‌ద్వారా కేవలం కార్యాలయాల్లోనే కాకుండా.. అధికారులు, సిబ్బంది ఫీల్డ్ విజిట్‌లకు వెళ్లినప్పుడు వారు వెళ్లిన ప్రదేశాల్లో సెల్ఫీ దిగి యాప్‌లో విధిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల ఫీల్డ్ ట్రిప్‌ల పేరుతో విధులకు డుమ్మా కొట్టే ఉద్యోగులకు చెక్ పడనుంది.

పైలెట్ ప్రాజెక్టుగా ముఖ్య కార్యాలయాల్లో అమలు..


యూబీఐ షిఫ్ట్ యాప్‌ను పైలెట్ ప్రాజెక్టుగా మే 8వ తేది నుంచి జిల్లాలోని కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాల్లో ప్రాజెక్టుగా అమలు చేశారు. దీని ద్వారా వారం రోజుల తర్వాత జిల్లాలోని మరిన్ని కార్యాలయాలకు విస్తరించి యాప్ పని విధానం పరిశీలించారు. ఫలితాలు మెరుగ్గా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలో జిల్లా చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్‌కు ఈ యాప్‌ను పూర్తిగా మానిటరింగ్ చేసే బాధ్యతలను అప్పగించి అధికారులు, ఉద్యోగులు సిబ్బంది ఉపాధ్యాయుల వివరాలను యాప్‌లో నమోదు చేసి, ఈ నెల 12వ తేది నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రవేశపెట్టనున్నారు.

యాప్ పరిధిలోకి 2 వేల మంది ఉద్యోగులు..


జిల్లా వ్యాప్తంగా 2వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయలు యూబీఐ షిఫ్ట్ యాప్ పరిధిలోకి రానున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో 11 మంది, ఆర్డీవో కార్యాలయంలో 15 మంది, తహసీల్దార్ కార్యాలయంలో 17 మంది, డీఎంహెచ్‌వో కార్యాలయంలో 55మందితో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1500మంది ఉపాధ్యాయులతో పాటు అంగన్‌వాడీ, ఆశావర్కర్లు దీని పరిధిలోకి రానున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ యాప్ అమలు ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయుల హాజరుశాతం పెరిగి పరిపాలన, సమస్యల పరిష్కారం వంటి వాటికి అధిక సమయం కేటాయించేందుకు ఉద్యోగులు అందుబాటులో ఉండటంతో పాటు పాఠశాల్లో మెరుగైన విద్యాభోధన జరగనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

2170
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles