బీర్కూర్ మండల అభివృద్ధి పనులను పరిశీలించిన సభాపతి పోచారం

Fri,March 22, 2019 06:06 PM

Speaker Pocharam srinivas reddy visits developments works in Birkur mandal

కామారెడ్డి : బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలంలో జరగుతున్న పలు అభివృద్ధి పనులను రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నేడు పరిశీలించారు. బీర్కూర్ మండల కేంద్రం సమీపంలో మంజీర నదిపై నిర్మిస్తున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణాన్ని సభాపతి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పనుల పరిశీలన అనంతరం పోచారం మాట్లాడుతూ.. పనులు చివరి దశలో ఉన్నాయని మరో నెల రోజులలోనే బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని రోడ్డు భవనాలశాఖ అధికారులను సూచించారు. వాహనాల రాకపోకలకు అనువుగా అప్రోచ్ రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.


అదేవిధంగా బీర్కూర్, కిష్టాపూర్ గ్రామాలలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్ళను పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అన్నారం గ్రామంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో రూ. 300 కోట్లతో 5 వేల రెండు పడక గదుల ఇళ్ళ నిర్మాణం జరుగుతుందన్నారు. ఇప్పటికే వెయ్యి ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసుకోని గృహ ప్రవేశాలు కూడా పూర్తైనట్లు తెలిపారు. మరో మూడు వేల ఇళ్ళ నిర్మాణం వివిధ దశలలో కొనసాగుతుంది. ఒక్కో ఇంటికి రూ. 5.04 లక్షలతో 100 శాతం సబ్సిడీతో ఇళ్ళను నిర్మిస్తున్నామన్నారు. అర్హులైన, పేదవారికి మాత్రమే అందిస్తున్నాం. ఇళ్ళు లేని పేదలందరికి స్వంత ఇంటిని నిర్మిస్తానని తెలిపారు.

959
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles