ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదాం : స్పీకర్ పోచారం

Fri,January 18, 2019 02:41 PM

హైదరాబాద్ : తెలంగాణ రెండో శాసనసభకు స్పీకర్ ఎన్నుకున్నందుకు ప్రతీ ఒక్క సభ్యునికి హృదయపూర్వక ధన్యవాదాలు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు కృషి చేసిన సీఎం కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శాసనసభలో స్పీకర్ మాట్లాడుతూ..శాసనసభాపతి పదవి అత్యంత కీలకం. సభ నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విధుల నిర్వహణలో సభాపతిగా న్యాయబద్దంగా వ్యవహరిస్తాను. సభ్యులందరి సహకారంతో సభా కార్యక్రమాలను ఆదర్శవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తాను. అసెంబ్లీని ప్రజాసమస్యలు చర్చించే వేదికగా నడుపుకోవడం మనందరి బాధ్యత.


ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం, సభకు అంతరాయం కలిగించడం గౌరవప్రదం కాదు. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా సభ నిర్వహించుకుందాం. ప్రజలకు న్యాయం చేసే క్రమంలో మీరంతా నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను. అందరం కలిసి సభను ఆదర్శ శాసనసభగా తీర్చిదిద్దుదాం. శాసనసభ గౌరవాన్ని ఇనుమడింపజేసేలా సభ్యులందరూ వ్యవహరిస్తారని ఆశిస్తున్నాను. వ్యవసాయ శాఖ మంత్రిగా రాష్ట్ర రైతాంగానికి సేవ చేసే అవకాశం కల్పించడమే కాకుండా లక్ష్మీపుత్రుడిగా బిరుదు ఇచ్చిన సీఎం కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.


2304
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles