ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం..

Sun,January 20, 2019 04:51 PM

Speaker Pocharam Srinivas address press meet today

హైదరాబాద్ : పరస్పర విమర్శలకుపోకుండా..ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామని సభ్యులందరికీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సభాపతిగా ఎన్నిక కావడం నాకు గొప్ప అవకాశంగా భావిస్తున్నా, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని పోచారం అన్నారు. స్పీకర్ పోచారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ..ప్రజలు మాపై నమ్మకం, విశ్వాసంతో ఇచ్చిన పదవులు ఇవి అన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు శాసనసభలో మేం సరైన పద్దతిలో వ్యవహరించాలన్నారు.

సభా సాంప్రదాయాలను గౌరవిస్తాం. సభా నియమ నిబంధనలకు అనుగుణంగా సభను నిర్వహిస్తాం. సభా గౌరవాన్ని కాపాడేలా అన్ని పక్షాలు నాకు సహకరిస్తాయని భావిస్తున్నా. మంచి సలహాలు, సూచనలను నేను స్వీకరిస్తాను. సభా గౌరవం, హుందాతనంతో గౌరవప్రదంగా నడుపుదాం. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాను. వ్యవసాయ రంగంలో దేశంలోనే రాష్ట్రాన్ని ముందంజలో నిలిపామన్నారు.

1121
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles