ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన స్పీకర్ పోచారం

Tue,March 12, 2019 11:12 AM

speaker pocharam and ktr casted their votes in mlc elections

హైదరాబాద్‌ : తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల్లో భాగంగా తొలి ఓటును స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి వినియోగించుకోగా, చివరగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్‌ఎస్‌, మజ్లిస్‌ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్‌ ప్రక్రియ అసెంబ్లీ కమిటీ హాల్‌-1లో కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. టీఆర్‌ఎస్‌ నుంచి మహముద్‌ అలీ, శేరి సుభాష్‌ రెడ్డి, ఎగ్గె మల్లేశం, సత్యవథి రాథోడ్‌, మజ్లిస్‌ నుంచి రియాజ్‌ పోటీలో ఉన్నారు.

1508
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles