నరసింహులపల్లెలో స్పీకర్ పల్లె ప్రగతి నిద్ర

Fri,April 13, 2018 08:56 AM

speaker Palle pragati nidra in Narasimhulapalle


వరంగల్ రూరల్ : శాయంపేట్ మండలం నరసింహులపల్లెలో స్పీకర్ మధుసూదనా చారి నిన్న రాత్రి పల్లె ప్రగతి నిద్ర చేశారు. స్పీకర్ ఇవాళ ఉదయం నిద్రలేచిన తర్వాత గ్రామస్తులతో సమావేశమయ్యారు. ప్రజా సమస్యలు చర్చించిన అనంతరం గ్రామ పరిసర ప్రాంతాలను తిరిగి చూశారు. రోడ్డు వెంట ఇరువైపులా ఉన్న చెట్లు, ముళ్ల పొదలను తొలగించాలని స్పీకర్ గ్రామస్థులు, అధికారులకు సూచించారు. రోడ్డుకిరువైపుల చెట్లను నాటితే వీధి దీపాలను ఏర్పాటు చేయిస్తానని గ్రామస్థులకు చెప్పారు. స్పీకర్ సైకిల్పై వెళుతున్న ఓ గ్రామస్తుడితో కాసేపు మాట్లాడారు. అతని సైకిల్ పై గ్రామ పొలిమేర వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర కలియదిరిగారు.

1162
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS