రైతును రాజు చేసేందుకు కృషి : మధుసూదనాచారి

Thu,May 17, 2018 03:16 PM

speaker madhusudanachary says about rythu bandhu pathakam


జయశంకర్ భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కొంపెల్లిలో స్పీకర్ మధుసూదనాచారి రైతులకు చెక్కులు, పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..రైతును రాజు చేసే బృహత్తర కార్యక్రమం తెలంగాణలో కొనసాగుతున్నదని అన్నారు. దేశంలోనే బెస్ట్ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రంగా ముందుకెళ్తుందని మంత్రి పోచారం పేర్కొన్నారు. కర్ణాటకలో బీజేపీ.. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టి 104 స్థానాలను గెలుచుకుందని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, చందూలాల్, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, బండా ప్రకాశ్ ముదిరాజ్, సీతారాం నాయక్ పాల్గొన్నారు.

1722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles