మండుటెండలో స్పీకర్ బైక్ రైడ్

Sun,April 22, 2018 08:13 AM

Speaker Madhusudanachary bike ride at Bhupalapally

భూపాలపల్లిరూరల్: అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి ఆరు పదుల వయసులోనూ ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఉత్సాహంగా పర్యటిస్తున్నారు. ఇటీవల బస్సులో ప్రయాణించగా.. శనివారం మండుటెండలో బైక్‌పై ఏకంగా 41 కిలోమీటర్లు తిరిగి తన వెంట ఉన్నవారిలో ఉత్సాహాన్ని నింపారు. భూపాలపల్లి మండలంలోని నూతన గ్రామపంచాయతీ వజినపల్లిలో శనివారం ఉదయం పల్లెనిద్ర కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత టూ వీలర్‌పై బయల్దేరారు. గొర్లవీడు, కొపెల్లి, చెల్పూరు మీదుగా గొల్లపల్లికి చేరుకొని అక్కడ రూ.16 లక్షలతో మిషన్‌కాకతీయ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడినుంచి కేఎల్పీ రోడ్డుగుండా సింగరేణి కార్మికుల క్వార్టర్ల సముదాయం నుంచి సింగరేణి ఏరియా వైద్యశాల వద్ద గల ప్రధాన రహదారికి చేరుకున్నారు.

1637
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles