జూన్ నుంచే ప్రణయ్ హత్యకు కుట్ర: ఎస్పీ రంగనాథ్

Tue,September 18, 2018 05:40 PM

SP Ranganath Explains pranay murder case details

నల్లగొండ: ప్రణయ్‌కుమార్ హత్య కేసు నిందితులను పోలీసులు మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ కేసులో ఏ 1 నిందితుడు తిరునగరు మారతీరావు, ఏ2 నిందితుడు శ్రవణ్‌కుమార్‌తోపాటు మిగిలిన నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కేసు వివరాలను ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. ప్రణయ్ హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేశాం. ప్రణయ్‌ను హత్యచేసింది సుభాష్ శర్మ. అతన్ని బీహార్‌లో అరెస్ట్ చేసినం. జూన్ నుంచి ప్రణయ్ హత్యకు కుట్ర జరిగింది. అస్గర్ అలీ సూచనల ప్రకారం ప్రణయ్ హత్యకు కుట్ర జరిగిందని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. 2011 నుంచే కరీంబారీతో మారుతీరావుకు పరిచయం ఉంది. మారుతీరావు తరపున కరీంబారీతో ఒప్పందం చేసుకున్నాడు.ప్రణయ్ హత్యకు కోటి రూపాయలతో ఒప్పందం కుదుర్చుకున్నాడన్నారు.

ప్రణయ్ హత్య కోసం ఒక స్కూటీ వాహనం, మూడు సిమ్‌కార్డులు కొన్నారు. హత్య కోసం అస్గర్ అలీ మూడు ఆయుధాలు కొనుగోలు చేశాడు. మరో పక్క అమృతను అబార్షన్ చేయించుకోవాలని తండ్రి మారుతీరావు ఒత్తిడి చేశారు. డాక్టర్ జ్యోతితో అమృత తండ్రి మారుతీరావు ఈ విషయమై మాట్లాడారు. ఆగస్టు 9 నుంచి ప్రణయ్ హత్యకు ప్లాన్ మొదలైంది. ఆగస్టు 14నే బ్యూటీ పార్లర్ దగ్గర ప్రణయ్ హత్యకు కుట్ర జరిగింది. ప్రణయ్, అమృత రిసెప్షన్ తరువాత హత్యకు కుట్ర జరిగిందని వెల్లడించారు.

సెప్టెంబర్ మొదటివారంలోనూ అమృతను కిడ్నాప్ చేసి ప్రణయ్‌ను చంపాలని ప్రయత్నం చేశారని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. హత్య జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో అస్గర్ అలీ కూడా ఉన్నాడు. ప్రణయ్ హత్య జరిగిన తీరును బారీ మారుతీరావుకు చేరవేశాడు. హత్య తర్వాత సుభాష్ శర్మ నల్గొండ నుంచి బెంగళూరుకు, బెంగళూరు నుంచి పాట్నాకు పరారయ్యాడు. రేపటిలోగా హంతకుడు సుభాష్‌శర్మను నల్లగొండకు తీసుకొస్తమని చెప్పారు. ఈ కేసులో ఐదుగురు ప్రధాన నిందితులున్నారు. మరో ఇద్దరికి బెయిల్ వచ్చే అవకాశాలున్నాయని ఎస్పీ రంగనాథ్ తెలిపారు. మారుతీరావు మొదటి నుంచి మోసకారి. హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద నిందితులపై కేసు నమోదు చేసినమని ఎస్పీ రంగనాథ్ తెలిపారు.3418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles