తెలుగులో సోని లైవ్ ప్రసార కార్యక్రమాలు

Tue,May 28, 2019 06:35 AM

Sony Live broadcast programs in Telugu

హైదరాబాద్ : వీక్షకులకు వినోదం పంచేందుకు సోని లైవ్ సేవలను తెలుగులో ప్రారంభిస్తున్నామని సోని నెట్‌వర్క్స్ ఇండియా బిజినెస్ హెడ్ డిజిటల్ ఉదయ్‌సోధీ తెలిపారు. జూన్ నుంచి సోని లైవ్‌లో ప్రసారం కానున్న తెలుగు కంటెంట్ కార్యక్రమాలను సినీ ప్రముఖులు నవదీప్, మారుతి, శరత్‌మరార్, గున్నం గంగరాజు తాజ్‌కృష్ణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉదయ్‌సోధీ మాట్లాడుతూ.. తెలుగులో తమసేవలు ప్రారంభించడం ద్వారా డిజిటల్ ఎకోసిస్టమ్‌లో తమ బ్రాండ్‌ను పటిష్ఠం చేసుకొంటామన్నారు. తెలుగులో ప్రఖ్యాతి చెందిన కథలను సోని లైవ్‌లో, సోని నెట్‌వర్క్‌లో చాలాకాలం పాటు ప్రసారమైన క్రైంస్టోరీలను తెలుగు పాత్రలతో రీమేక్ చేయనున్నట్టు తెలిపారు. క్రీడలపై మక్కువున్నవారు ఇకపై తమ ఇష్టమైన క్రీడలను తెలుగు కామెంటరీతో వీక్షించవచ్చని అన్నారు. ప్రస్తుతం సోని లైవ్ హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో ప్రసారమవుతుందని, త్వరలోనే తమిళంలో కూడా ప్రారంభిస్తున్నామని తెలిపారు.

2356
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles