అమ్మాయి కోసం అమ్మ నగలు ఎత్తుకెళ్లాడు..

Thu,November 21, 2019 09:28 PM


హైదరాబాద్: ఓ యువకుడు అమ్మాయి కోసం అమ్మ నగలే చోరీ చేశాడు. ఈ ఘటన బోరబండలోని ఎస్ఆర్ఆర్ పురం కాలనీలో వెలుగుచూసింది. అరుణ్ అనే యువకుడు కొంతకాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆమె కోసం అరుణ్ ఇంట్లో అతని తల్లి దాచిపెట్టిన 8 తులాల బంగారం, 50 వేల నగదును అపహరించుకెళ్లాడు. తన కొడుకు అరుణ్ చోరీ చేశాడని గుర్తించిన తల్లి లక్ష్మి ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అరుణ్ పై ఐపీసీ 420, 380 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

545
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles