పరువు తీశాడన్న నెపంతో దారుణం



Tue,November 14, 2017 10:22 PM
పరువు తీశాడన్న నెపంతో దారుణం

నర్సాపూర్ : దొంగతనం చేసి పరువు తీశాడన్న నెపంతో తండ్రిని హతమార్చిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దచింతకుంటలో జరిగింది. గ్రామానికి చెందిన తలారి యాదయ్య(45), అదే గ్రామానికి చెందిన చాకలి శ్రీనివాస్‌లు కలిసిరెండురోజుల క్రితం శ్రీనివాస్ తల్లి బాలమ్మతో కలిసి పింఛన్ డబ్బులు డ్రా చేయడానికి నర్సాపూర్‌లోని బ్యాంక్ వెళ్లారు. బ్యాంకులోనుంచి రూ.60వేలు తీసుకున్న తర్వాత ఇద్దరు కలిసి మద్యం సేవించారు.రెండు రోజుల తర్వాత తన వద్ద నుంచి రూ.30 వేలు దొంగిలించాడని యాదయ్యపై చాకలి శ్రీనివాస్‌నర్సాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే గ్రామ పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీలో యాదయ్య డబ్బులు దొంగిలించినట్లు తేలింది. దొంగతనం చేసి పరువు తీశావని క్షణికావేశంలో యాదయ్య కొడుకు సురేశ్ తండ్రిడి బండరాయితో మోది హతమార్చాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

661
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS