వేధింపులు భరించలేక.. కన్నతండ్రిని కడతేర్చిన కుమారుడు

Fri,June 21, 2019 08:31 PM

son kills father in bhadradri kothagudem dist

భద్రాద్రి కొత్తగూడెం: నిత్యం మద్యం మత్తులో తల్లితో పాటు కుటుంబ సభ్యులందరినీ వేధిస్తున్నాడనే కారణంతో సొంత తండ్రినే చంపేశాడు కొడుకు. మరోవ్యక్తితో కలిసి తండ్రి గొంతు నులిమి హత్య చేసిన సంఘటన టేకులపల్లి మండలంలోని ఇప్పలతండాలో ఇవాళ చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఇప్పలతండాకు చెందిన భూక్య నాగేశ్వరరావు (50), రాంలీ దంపతులకు కుమారుడు సుమన్, కుమార్తె బేబీ ఉన్నారు.

కుమారుడు సుమన్ కిన్నెరసాని కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో తిరిగి కళాశాలలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా తండ్రి నాగేశ్వరరావు ప్రతిరోజు మద్యం తాగి కుటుంబ సభ్యులందరితోనూ ఘర్షణ పడుతుండటం సుమన్‌కు నచ్చలేదు. ఇలా ప్రతి రోజు ఇంట్లో తండ్రి వేధింపులను భరించలేకపోయాడు.

గురువారం రాత్రి తండ్రి వెంటనే తోట వద్దకు కాపలాకు వెళ్లాడు. తండ్రి వెనుకాలే ఇంటిపక్కన ఉండే బాదవత్ హనుమంతుతో కలిసి వెళ్లిన సుమన్ చేను వద్దనే కర్రతో తలపై బలంగా దాడిచేసి గొంతు నులిమి హతమార్చాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. వెంటనే తన తండ్రిని హత్య చేసినట్టు సుమన్ నేరం అంగీకరించాడు. సుమన్, హత్యకు సహకరించిన హనుమంతు ఇద్దరు0 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇల్లెందు సీఐ వేణుచందర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

6998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles