తండ్రిని హత్యచేసిన కొడుకు

Thu,November 15, 2018 06:54 AM

son killed his father in Devarakonda

దేవరకొండ : కొడుకు చేతిలో తండ్రి హత్యకు గురైన సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పడ్మట్‌పల్లిలో రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పడ్మట్‌పల్లి గ్రామానికి చెందిన దాసరి యాదయ్య(46)కు భార్య పార్వతమ్మ, కుమారుడు రమేశ్ ఉన్నారు. కొంతకాలంగా మద్యానికి బానిసైన యాదయ్య కుటుంబసభ్యులను వేధింపులకు గురిచేస్తున్నాడు. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన యాదయ్య భార్య, కుమారుడితో గొడవపడ్డాడు. దీంతో తండ్రిపై కర్రతో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

581
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles