గ్రామాలను పరిశ్రమలకు దత్తత ఇచ్చేందుకు కసరత్తు

Wed,June 12, 2019 06:21 AM

Some villages to adopt to industries in medchel


మేడ్చల్‌ జిల్లా: జిల్లా పరిధిలోని పలు గ్రామాలను ఆయా గ్రామాల పరిధిలోని పరిశ్రమలకు దత్తత ఇచ్చేందుకు జిల్లా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్‌ డా.ఎంవీ రెడ్డి సూచనల మేరకు జిల్లా పరిధిలోని 61 గ్రామాల కార్యదర్శులతో జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

గ్రామాల్లో శానిటేషన్‌, డంపింగ్‌యార్డు, శ్మశాన వాటిక, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, టాక్స్‌ డిమాండ్‌, డాష్‌బోర్డులో కార్యదర్శి పనితీరు, సీసీ రోడ్ల నిర్మాణం, హరితహారం తదితర అంశాలపై సమీక్షించిన ఆయన గ్రామాల దత్తతపై చర్చించారు. ముందుగా జిల్లా పరిధిలో 9 గ్రామాలు (పూడూరు, శామీర్‌పేట్‌, మూడుచింతలపల్లి, కీసర, చౌదరిగూడ, ఏదులాబాద్‌, చీర్యాల్‌, డబీల్‌పూర్‌, అంకిరెడ్డిపల్లి) గ్రామాలను పరిశ్రమలు దత్తత తీసుకొని అభివృద్ధి చేపట్టేలా జిల్లా పంచాయతీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

2330
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles