జిల్లాల్లో పలు గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం

Thu,January 17, 2019 07:47 PM

Some Gram panchayats unanimous elected in district

హైదరాబాద్ : రెండవ విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన అనంతరం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. పెద్దపల్లి జిల్లాలోని తొమ్మిది గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది. పెద్దపల్లి మండలంలోని గుర్రాంపల్లి సర్పంచ్ గా మాదిరెడ్డి భాగ్యలక్ష్మి, కురుమపల్లి సర్పంచ్ మామిడిపల్లి బాపయ్యతో పాటు రెండు గ్రామాల్లో వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆశన్నపల్లి సర్పంచుగా మంద రమ, లక్ష్మిపూర్ గ్రామ సర్పంచ్ గా బండ రవీందర్ రెడ్డితో పాటు వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరెపల్లి సర్పంచ్ గా పొన్నమనేని దేవేందర్ రావు, ఓదెల మండలంలోని లంబాడితండ గ్రామ సర్పంచ్ గా గుగులోతు లక్ష్మి, బాయమ్మపల్లి సర్పంచ్ గా కొమరయ్య ఏకగ్రీవ ఎన్నికయ్యారు. అబ్బిడిపల్లి సర్పంచ్ గా ఓద్దె కొమలత, శానగొండ సర్పంచ్ గా గుంటి సునిత ఎన్నిక ఏకగ్రీవం అయింది.

మహబూబ్ నగర్ జిల్లా జడ్జర్ల నియోజకవర్గంలో 45 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 20 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. అమరచింత మండలంలో 7 గ్రామాలు, మదనాపూర్ మండలంలో 4 గ్రామాలు, కొత్తకోట మండలంలో 4 గ్రామాలు, పెద్దమందడి మండలంలో 5 గ్రామ పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవం అయింది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలంలోని సంకారం, పొక్కుర్ గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే 149 పంచాయతీలకు గాను 64 గ్రామపంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.


4259
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles