పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా పరిష్కారాలు: కేటీఆర్

Sat,May 5, 2018 05:55 PM

Solutions according to growing traffic says KTR

హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా కేంద్రంతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పరిష్కారాలు చేపట్టినట్లు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్రం సహకారంతో మహానగరంలో నాలుగు ప్రధాన ప్రాజెక్టులకు జీహెచ్‌ఎంసీ అంకురార్పణ చేసింది. అంబర్‌పేట్, ఉప్పల్ ఫ్లై ఓవర్లకు, ఆరాంఘర్, మెదక్ రోట్ల విస్తరణ పనులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణకు సహకరిస్తున్న కేంద్రమంత్రి గడ్కరీకి ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. నితిన్ గడ్కరీ కార్యదక్షతను సీఎం కేసీఆర్ అనేకసార్లు ప్రస్తావించినట్లు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నితిన్ గడ్కరీ మద్దతు ఎంతో ఉందన్నారు. ఉప్పల్ కారిడార్‌తో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. 54 జంక్షన్‌లలో ఫ్లై ఓవర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణలో అద్భుత ప్రజారవాణా వ్యవస్థ ఉందన్నారు. రూ. 23 వేల కోట్లతో స్కైవేలు, ైఫ్లెఓవర్ల నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ఇప్పటికే రూ. 3 వేల కోట్ల పనులు నడుస్తున్నాయన్నారు. మరో రూ. 4 వేల కోట్ల పనులు త్వరలో ప్రారంభం అవుతాయని తెలిపారు. ఎస్‌ఆర్‌డీపీకి కేంద్రం సాయం చేయాలని కోరుతున్నట్లు కేటీఆర్ అన్నారు. కేంద్రం సాయం చేస్తే త్వరగా ఎస్‌ఆర్‌డీపీని పూర్తి చేస్తమన్నారు. మల్టీ మోడల్ లాజిస్టిక్స్, మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్టేషన్‌తో అభివృద్ధి సాధ్యమన్నారు. రెండో దశ మెట్రోను అక్టోబర్‌లో పూర్తి చేసుకోబోతున్నమన్నారు. నగరంలో మరో రెండు ఎలివేటెడ్ కారిడార్‌లను నిర్మించబోతున్నట్లు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

1579
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles