లారీ ఢీకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి

Sun,April 7, 2019 06:18 AM

software employee dies in road accident

హైదరాబాద్ : లారీ ఢీకొని సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని మృతి చెందిన సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లి మండలం పర్వతాపూర్ ప్రాంతానికి చెందిన కొండవీటి జాన్ మాథ్యూ కుమార్తె కొండవీటి సోనాలి(21) రామంతాపూర్‌లోని ఎన్‌ఎస్‌ఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తుంది. విధులు ముగిసిన అనంతరం సోనాలి ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరింది. ఉప్పల్ రింగ్‌రోడ్డు ప్రాంతంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు చేరుకున్న సోనాలి వాహనాన్ని అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

2179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles