సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్చం అందించిన పోలీసు జాగిలం

Fri,May 19, 2017 03:42 PM

sniffer dog welcomes CM KCR

ఇవాళ హెచ్ఐసీసీలో ఎస్సై నుంచి డీజీపీ స్థాయి వ‌ర‌కు హాజ‌రైన పోలీసుల‌ను ఉద్దేశించి సీఎం కేసీఆర్ మాట్లాడారు. సదస్సు ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్ఐసిసిలో ఏర్పాటు చేసిన పోలీస్ ఎగ్జిబిషన్ ను సందర్శించారు. పోలీసు జాగిలం పుష్పగుచ్చం ఇచ్చి ముఖ్యమంత్రికి స్వాగతం పలికింది. ఇతర జాగిలాలు కూడా సిఎంకు సెల్యూట్ చేశాయి. బాంబు స్క్వాడ్, ప్రొటెక్షన్ అండ్ డిస్పోజల్ ఎక్విప్మెంట్, సెర్చ్ అండ్ డిటెన్షన్ ఎక్విప్మెంట్ ను సిఎం పరిశీలించారు. పోలీస్ కమ్యూనికేషన్ వ్యవస్థ పనితీరును తెలుసుకున్నారు. క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ విభాగం ఎలా పనిచేస్తుందో పోలీసులు ప్రదర్శించి చూపారు. పోలీసులు వాడే వివిధ రకాల ఆయుధాలను, వాటి సామర్థ్యాన్ని కూడా సిఎంకు వివరించారు.

డ్రగ్స్ ను గుర్తించే అధునాతన పరికరాలను, వేలిముద్రలను గుర్తించే ప్రక్రియను, వేలి ముద్రల ద్వారా నేరస్తుల చరిత్రను అనుసంధానం చేసే ప్రక్రియను సిఎం ఆసక్తిగా గమనించారు. దొంగనోట్లను గుర్తించే పరికరాలు, వాటి పనితీరును సిఎం తెలుసుకున్నారు. షీ టీమ్స్ ఎలా పనిచేస్తుంది? పోకిరీలను ఎలా గుర్తిస్తున్నది కూడా ఎగ్జిబిషన్ లో ప్రదర్శించి చూపారు. డిజిపి అనురాగ్ శర్మ, సిపి మహేందర్ రెడ్డి, ఇతర అధికారులు ముఖ్యమంత్రికి పోలీసు విభాగాలను చూపించి, వివరించారు.

2002
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS