కల్లు తాగి..కుండలో పడుకొని..నాగుపాము హల్‌చల్

Fri,November 8, 2019 10:30 PM

హుజూరాబాద్‌ టౌన్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ సమీపంలో ఓ నాగు పాము ఈత చెట్టు ఎక్కి కుండలోని కల్లు తాగడంతో పాటు ఆ కుండలోనే పడుకున్నది. వివరాల్లోకెళితే, వరంగల్‌ రోడ్డులోని బీఆర్‌ఎస్ గార్డెన్ సమీపంలో ఈత వనంలో ఈత చెట్టుకు పంజాల కొంరెల్లిగౌడ్ అనే గీత కార్మికుడు రాత్రి గీసి కుల్లకుండ పెట్టి ఇంటికి వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో కుండ ఇప్పేందుకు వెళ్లగా ఓ నాగుపాము ఈత చెట్టు ఎక్కి కల్లు తాగడం చూశాడు. వెంటనే ఇరుగు పొరుగు వారికి చెప్పగా, వారు వెళ్లి చూసేసరికి పాము కనిపించలేదు. నిచ్చెన వేసుకొని చెట్టు ఎక్కి కుండ ఇప్పుతుండగా బుస్‌బుస్ అంటూ సౌండ్ వచ్చింది. వెంటనే కుండలోకి తొంగి చూడగా పాము అందులో కనిపించింది. తాను అజాగ్రత్తగా చేయి పెట్టి ఉంటే ప్రాణాపాయం జరిగేదని కొంరెల్లిగౌడ్ ఆందోళన వ్యక్తం చేశాడు.

43583
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles