అంగన్‌వాడీల్లో స్మార్ట్ సేవలు

Tue,February 12, 2019 01:45 PM

అంగన్‌వాడీ కేంద్రాల పటిష్టతకు రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు, సరుకుల పంపిణీలో లోపాలు తలెత్తకుండా ఉండేందుకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు అంగన్‌వాడీ సూపర్ వైజర్లకు ట్యాబ్‌లు, టీచర్లకు దశల వారీగా స్మార్ట్‌ఫోన్లు అందింస్తుంది. ఈ విధానం వచ్చే నెల నుంచి అమల్లోకి తీసుకురానుంది. దీంతో కేంద్రాల నిర్వహణలో లోటుపాట్లు లేకుండా చూడాలని భావిస్తోంది. విద్యార్థుల హాజరు మొదలు పంపిణీ చేసే సరుకుల వరకు అన్ని వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

అంగన్‌వాడీలకు అందించే ట్యాబ్‌లు, స్మార్ట్‌ఫోన్లను కామన్ అప్లికేషన్ సిస్టమ్ (సీఏఎస్) అనే ప్రత్యేక యాప్‌తో అనుసంధానం చేయనున్నారు. రోజు వారీగా బాలబాలికలు, గర్భిణులకు అందించే పౌష్ఠికాహార పదార్థాలను సీఏఎస్ ద్వారా నమోదు చేసి పంపిణీ చేస్తారు. సీఏఎస్‌లోనే అటెండెన్స్, పోషక పదార్థాల పంపిణీ వంటి అప్లికేషన్లు ఉంటాయి. వీటిని తమ వద్ద ఉన్న ఫోన్లలో నమోదు చేస్తే సరిపోతుంది. ఏ రోజు ఎంత మంది సెంటర్‌కు హాజరయ్యారు. ఎన్ని కోడి గుడ్లు, బియ్యం, బాలమృతం పంపిణీ చేశారు అనే అంశాలు తెలిసిపోతాయి. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లో బయోమెట్రిక్ ద్వారా లబ్ధిదారులకు కోడి గుడ్లు, బియ్యం, బాలమృతం వంటి పోషకాహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. తాజాగా సీఏఎస్ విధానం ద్వారా మరింత పారదర్శకంగా లబ్ధిదారులకు పౌష్ఠికాహారం దరి చేరనుంది.

పనుల్లో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం స్మార్ట్ సేవలకు శ్రీకారం చుట్టింది. అంగన్‌వాడీ కేంద్రాల పటిష్టం కోసం కేంద్రం చేపట్టిన పోషణ అభియాన్ పథకం నుంచి అంగన్‌వాడీ సూపర్‌వైజర్లకు ట్యాబ్స్, టీచర్లకు దశల వారీగా స్మార్ట్ ఫోన్లను అందజేయనున్నారు. బయోమెట్రిక్ యాప్‌తో లబ్ధిదారుల ఫొటోలు, వివరాలు నమోదు చేసి వేలిముద్రలు తీసుకొని పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. సెంటర్లకు హాజరయ్యే బాలబాలికల అటెండెన్స్‌తో పాటు సరుకుల పంపిణీపై ఏ రోజుకారోజు ఆన్‌లైన్ చేసేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో అంగన్‌వాడీ కేంద్రాల్లో జరిగే అక్రమాలకు చెక్ పడనున్నది.

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందించే పౌష్టికాహారం పంపిణీలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని గుర్తించిన ప్రభుత్వం కేంద్రాల్లో వీటికి చెక్ పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. గర్భిణులు, బాలింతలకు పాలు, గుడ్లు, మధ్యాహ్న భోజనం, చిన్నారులకు బాలామృతం, మురుకులు అందనున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల పటిష్టం కోసం కేంద్రం చేపట్టిన పోషనాభియాన్ పథకం ద్వారా అంగన్‌వాడీ సూపర్‌వైజర్లకు ట్యాబ్స్, టీచర్లకు దశల వారిగా స్మార్ట్‌పోన్లలోని బయోమెట్రిక్ యాప్ ద్వారా లబ్ధిదారుల ఫొటోలు, వివరాలు నమోదు చేసి వేలిముద్రాలు తీసుకొని పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది. ఇందుల్లో భాగంగా అంగన్‌వాడీ సెంటర్లలో పని చేసే సిబ్బందికి స్మార్ట్‌ఫోన్లు పంపిణీ చేసి శిక్షణ సైతం ఇవ్వనున్నారు. సెంటర్లకు హాజరయ్యే బాలబాలికల అటెండెన్స్‌తో పాటు సరుకుల పంపిణీపై ఏ రోజుకారోజు ఆన్‌లైన్ చేసే విధంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి క్షణాల్లో ఉన్నతాధికారులకు సమాచారం అందేవిధంగా స్మార్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఐసీడీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న సూపర్‌వైజర్లకు ట్యాబ్‌లు, టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు అందించడానికి అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

సూపర్‌వైజర్లకు ట్యాబ్‌లు, టీచర్లకు ఫోన్లు

ఐసీడీఎస్‌లో పని చేస్తున్న సూపర్‌వైజర్లకు ట్యాబ్‌లు, అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లకు స్మార్ట్‌ఫోన్లు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. వీటి వినియోగంపై సూపర్‌వైజర్లు, టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. విడతల వారీగా వినియోగంపై అవగాహన కల్పించి, మార్చి నుంచి స్మార్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

3455
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles