పర్యాటకశాఖ యునిట్ మేనేజర్లకు స్కిల్ ట్రైనింగ్

Thu,June 20, 2019 07:12 AM

Skill Training for Department of Tourism Unit Managers

హైదరాబాద్ : పర్యాటకశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత హోటల్స్,రిసార్ట్స్‌లో సేవలు మరింత మెరుగు పరిచేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రైవేటు హోటల్ రంగం దూసుకువెళ్తున్న నేపథ్యంలో వీటితో పోటీగా పర్యాటకశాఖ కూడా అతిథ్య రంగంలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అందులోభాగంగా పర్యాటక శాఖకు చెందిన యునిట్ మేనేజర్లకు నాలుగు రోజుల పాటు సాఫ్ట్‌స్కిల్స్‌పై శిక్షణ ఇస్తున్నారు. హోటల్ మేనేజ్‌మెంట్‌లో పేరు ప్రఖ్యాతులున్న విద్యా నగర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ సంస్థ సమన్వయంతో హాస్పాటాలిటీపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. శిక్షణలో భాగంగా సిబ్బందిని మరింత సుశిక్షితులను చేయడంతోపాటు పోటీ ప్రపంచంలో కొత్త సవాళ్ళను , కొత్తగా వస్తున్న డెవలప్‌మెంట్స్‌ను , ఇండస్ట్రీ డిమాండ్స్‌ను అనుసరించి రావాల్సిన మార్పులను వివరించనున్నారు. వచ్చే పర్యాట కులను ఎలా సంతృప్తి పరుచాలన్న దానిపైనే వీరికి శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేటు హోటల్స్‌తో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో మెరుగైన సౌకర్యాలను అందించడం వంటి వాటిపైనే పూర్తిస్థాయి దృష్టిసారించేలా శిక్షణ ఇస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న హరిత హోటల్స్ అండ్ రిసార్ట్స్‌ను మరింత టూరిస్ట్‌లు అకర్షించేలా ఉండేందుకు తీసుకునే చర్యలపై పూర్తిస్థాయి శిక్షణ కొనసాగిస్తున్నట్లు టీఎస్‌టీడీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles