హైదరాబాద్: 2021 జనాభా లెక్కల సేకరణ ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్కే జోషి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఇలంబర్తి పాల్గొన్నారు. రాష్ట్రంలో 65 మంది మాస్టర్ ట్రైనర్లకు తొలి విడత శిక్షణ ముగిసిందని తెలిపారు. ఈ నెల 7వ తేదీ వరకు రెండో విడత శిక్షణ నిర్వహించనున్నట్లు తెలిపారు. 2020 జనవరిలో 2వేల మంది ఫీల్డ్ మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇస్తారు. ఫీల్డ్ ట్రైనర్లు ఏప్రిల్లో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇస్తారు. జనగణనతో నివాసాల గుర్తింపు, జాతీయ జనాభా రిజిస్టర్ను సవరిస్తాం. వ్యక్తుల వివరాలు సహా సామాజిక, ఆర్థిక, సాంస్కృతికి, నివాస, ఆర్థిక వివరాలు సేకరిస్తామన్నారు. జనాభా లెక్కల సేకరణ మొబైల్ యాప్, పేపర్ షెడ్యూల్ ద్వారా చేపట్టనున్నట్లు చెప్పారు.
జనాభా లెక్కల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందించాలని సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఇలంబర్తి కోరారు. గ్రామాలు, పట్టణాలకు సంబంధించి ప్రాథమిక సమాచారంగా జనాభా లెక్కలు పనిచేస్తాయన్నారు. విద్య, వైద్య, భాష, ఆర్థిక, నివాస వివరాలను జనాభా లెక్కలు తెలుపుతాయన్నాయి.