ప్రైవేట్ పాఠశాల డైరక్టర్ కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు

Mon,January 1, 2018 10:26 PM

Six-member gang held for kidnapping director of private school in Hyderabad

హైదరాబాద్ : ఏడాది కిందట జరిగిన ఓ ప్రైవేట్ పాఠశాల డైరక్టర్ కిడ్నాప్ కేసు మిస్టరీని రాచకొండ ఎస్‌ఓటీ పోలీసులు చేధించారు. ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డ ఆరుగురిని అరెస్టు చేయగా ప్రధాన సూత్రధారితో పాటు ఇద్దరు మహిళలు పరారీలో ఉన్నారు. వ్యాపారంలో నష్టం పోయిన నగదును సంపాదించేందుకు సమీప బంధువు ఆస్తులపై ప్రధాన సూత్రధారి నజర్ పెట్టడంతో డిసెంబరు 14, 2016లో కిడ్నాప్ చోటు చేసుకుంది. మరుసటి రోజు బాధితుడుని విడుదల చేసినప్పటికి మిస్టరీ మాత్రం వరకు కొనసాగింది. స్పెషల్ అపరేషన్ టీంకు వచ్చిన ఓ కీలక సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు మొత్తం గుట్టును బయటపెట్టారు.

మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ తెలిపిన వివరాల ప్రకారం...పెద్దపల్లి జిల్లా కిస్టమ్‌పల్లి, కమాన్‌పుర్ ప్రాంతానికి చెందిన గడ్డి సదానంద్ అలియాస్ నందు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు హైదరాబాద్ హబ్సిగూడ ప్రాంతంలో గ్రాఫ్ టెక్నాలజీ పేరుతో ఓ కన్సల్టెన్సిని నిర్వహిస్తున్నాడు. వీటిలో తీవ్ర నష్టం రావడంతో ఆర్థికంగా చిన్నభిన్నం అయ్యాడు. వీటిని అధిగమించేందుకు నాచారంలో ఉంటున్న సమీప బంధువు పల్లవి స్కూల్ డైరక్టర్ సుశీల్‌పై నజర్ పెట్టాడు. అతనిని కిడ్నాప్ చేసి రూ. కోటి డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం పెద్దపల్లి జిల్లాకు చెందిన తన్న చిన్ననాటి స్నేహితుడు చల్ల గోని సంతోష్‌ను సంప్రదించి కిడ్నాప్‌కు స్కెచ్ వేశాడు.

పోలీసు తనిఖీని తలపించి కిడ్నాప్..
గడ్డి సదానంద్‌తో ఒప్పందం ప్రకారం సంతోష్ తన టీం సభ్యులు అల్గొటి రాహూల్,కిరణ్, నరేష్, ఎం.డి యూనిస్‌ఖాన్, రాజ్‌కుమార్‌లతో కలిసి రంగంలో దిగాడు. 2016 సెప్టెంబరు నెల నుంచి ఈ టీం సుశీల్‌ను దగ్గర నుంచి మేడిపల్లిలోని అతని స్కూల్ నుంచి ఇంటికి ప్రయాణీంచే రూటును నాలుగు సార్లు పరిశీలించారు. దీంతో కీసర ప్రాంతంలోని ఆర్‌ఎల్‌ఎన్ కాలనీలో ఓ ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. కిడ్నాప్ పై ఏలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు పోలీసు తనిఖీ సెట్‌అప్‌ను ఎంచుకున్నారు. దీని కోసం నాచారం పరిధిలోని అంతర్గత రోడ్లలలోని నిర్మానుష్య ప్రాంతాల గురించి తెలుసుకుని సుశీల్ ప్రయాణీంచే నాచారం, చిలుకా నగర్ మధ్యలోని ఓ నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకున్నారు.

డిసెంబరు 14న రాత్రి 7 గంటల ప్రాంతంలో స్కూల్ నుంచి బయలు దేరిన విషయాన్ని తెలుసుకోగానే కిడ్నాప్ స్పాట్‌లో ఇండికా కారును పక్కన పెట్టుకుని బయట ముగ్గురు కారులో ఇద్దరు ఉన్నారు. సుశీల్ కారు రాగానే సంతోష్ బ్యాటన్ లైట్ ను చూపిస్తూ సుశిల్ కారును ఆపి సార్ పిలుస్తున్నాడంటూ అతనిని ఇండికా కారు దగ్గరకు తీసుకువెళ్ళారు. కారు దగ్గరకు వెళ్ళగా సుశీల్‌ను కారు లోపలికి తోసేసి అక్కడి నుంచి నేరుగా కీసరలో అద్దెకు తీసుకున్న ఇంటికి తీసుకువచ్చారు. ఈ మధ్యలో సుశీల్ కు మంకీ క్యాప్‌ను వేసి వారిని గుర్తుపట్టకుండా దుండగులు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కీసరకు వెళ్ళిన తర్వాత నందు ఆ ఇంటికి వెళ్ళి తుపాకీ చూపించి కోటి రుపాయాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. లేదంటే నీ ప్రాణాలతో పాటు తల్లిదండ్రుల ప్రాణాలను తీస్తానని బెదిరించాడు.

ఆ సమయంలో డిమానిటైజేషన్ నడస్తుండడంతో సుశీల్ తనకు వారం రోజుల పాటు గడువు కావాలని వేడుకున్నాడు. దీంతో పాటు కిడ్నాప్ పై హల్‌చల్ కావడంతో దుండుగు భయపడ్డారు. దీంతో డిసెంబరు 16న వారం రోజుల తర్వాత నగదును తెచ్చి ఇవ్వాలని లేదంటే నీ చావు ఖాయమంటూ బెదిరించి అతని కారు తాళాలు, మొబైల్ ఫోన్‌లను తీసుకుని ముఠా లోని ఇద్దరు సుశీల్‌ను షామీర్‌పేట్ కొల్తూర్ ప్రాంతంలో వదిలేశారు. సుశిల్ కిడ్నాప్‌పై డిసెంబరు 14న తండ్రి రాజమౌళి మేడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సుశీల్‌కు మంకీ క్యాప్‌లు వేయడంతో అతను కిడ్నాప్ చేసిన వారిని గుర్తించలేకపోయాడు. సుశిల్ ఇంటికి తిరిగి రావడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు పోలీసులు ఊపీరి పీల్చుకున్నారు. కేసులో ఏలాంటి క్లూ లేకపోవడంతో దాదాపు ఏడాది పాటు ఈ కిడ్నాప్ కేసు అనేక అనుమానాలతో పెండింగ్‌లో పడిపోయింది.

సాంకేతిక ఆధారం అన్వేషణలో దొరికిన కీలక క్లూ...
ఇంటికి చేరిన సుశిల్‌కు కిడ్నాపర్‌లు పలు మార్లు ఫోన్‌లు చేసినా అతను స్పందించలేదు.దీంతో సంతోష్ తన టీమ్‌తో జనవరి 31న 2017 లో ఇంటి ముందు పార్క్ చేసిన సుశిల్‌కు చెందిన ఖరీదైన కారును చోరీ చేశారు. టోల్‌ప్లాజా నుంచి కాకుండా దొడ్డి దారుల్లో ప్రయాణీంచి చోరీ చేసిన కారును బెంగళూరుకు తీసుకువెళ్ళారు. అక్కడ ప్రధాన సూత్రధారి నందు భార్య శీరిష్ ఇంట్లో దాచిపెట్టారు. ఆ తర్వాత కర్నాటక రాష్ట్రానికి చెందిన నెంబరు ప్లేటను వేసుకుని తిరిగారు. ఆ తర్వాత సంతోష్ డబ్బు కోసం నందుపై ఒత్తిడిని పెంచాడు. దీంతో సందు లక్ష రుపాయాల నగదును ఇచ్చి ఈ విషయాన్ని ఎవరీకి చెప్పొద్దని బెదిరించాడు.

ఈ పెండింగ్ కేసును చేధించే విషయంలో పోలీసులు సాంకేతిక ఆధారం కోసం గాలించడం ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా పోలీసులకు ఓ కీలక ఆధారం దొరికింది. సంతోష్‌ను అదుపులోకి తీసుకోవడంతో మొత్తం సుశిల్ కిడ్నాప్ డ్రామా బయటికి వచ్చింది. సంతోష్‌తో పాటు రాహూల్, కిరణ్, నరేష్, ఎండి యూనిస్ ఖాన్, రాజు కుమార్‌లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 3 కారులు, ఓ పిస్తోలు, 6 బుల్లెట్‌లు, 6 పాసుపోర్టులు, మొబైల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి సదానంద్ అలియాస్ నందు పరారీలో ఉన్నాడు.

రాజకీయ పలుకుబడి తో తుపాకీ లైసెన్స్..
సదానంద్ తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి 2015 సంవత్సరంలో తుపాకీ లైసెన్స్ తీసుకున్నాడు. ఇలా నందు మొత్తం షోపుటప్ చేస్తూ అందర్నీ ఆకర్షిస్తూ భారీగా డబ్బులను వసూలు చేస్తూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అదే విధంగా నందు తన భార్యలు శిరీష, స్వప్నలతో కలిసి పలు ప్రైవేట్ బ్యాంకులలో తప్పుడు పత్రాలను పోందుపర్చి దాదాపు 50 లక్షల పైన రుణాలు తీసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. అదే విధంగా వివిధ ప్రాజెక్ట్‌ల వర్క్‌ల పేరుతో కూడా లక్షలాది రుపాయాలను వసూలు చేశాడని పోలీసులకు మౌఖిక ఫిర్యాదులు ఉన్నాయి. అదే విధంగా ఈ కిడ్నాప్‌కు సంబంధించిన వ్యవహరంలో నందుతో పాటు అతని భార్యలు శిరీష, స్వప్నల పాత్ర కూడా ఉందని పోలీసులు స్పష్టం చేశారు. అయితే నందు సోదరీమణులైన శిరీష, స్వప్నలను వివాహం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలినప్పటికి అధికారిక ఆధారాలను సేకరిస్తున్నట్లు పోలీసుల తెలిపారు. ప్రస్తుతం ఈ ముగ్గురు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

1287
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles