మరుగుదొడ్ల సౌకర్యం లేదని ప్రయాణికుల ఆందోళన

Thu,May 16, 2019 06:56 PM

sirpur fast passenger train passengers protest in dornakal railway station

డోర్నకల్: భద్రాచలం రోడ్ నుంచి సిర్పూర్ టౌన్ వెళ్లే ఫాస్ట్ ప్యాసింజర్ రైలులో ప్రయాణికులకు కనీస సౌకర్యాలైన నీరు, మరుగుదొడ్ల సౌకర్యం లేదని డోర్నకల్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికులు ఆందోళనకు దిగారు.

భద్రాచలం రోడ్ నుంచి సిర్పూర్ టౌన్ మధ్య సుమారు 380 కిమీ దూరం వుంటుంది. గతంలో సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్‌కు 18 బోగీలు వుండేవి. తరువాత వాటిని కుదించి 16 కన్వెన్షన్ బోగీలు ఏర్పాటుచేశారు. గత మార్చి నెలలో మెము రైలుగా మార్చారు. మెము రైలులో 3 బోగీలకు కలిపి ఒక టాయిలెట్ చొప్పున మొత్తం 12 బోగీలకు గాను 4 టాయిలెట్లే వుండటంతో అవి సరిపోక ప్రయాణికులు, ముఖ్యంగా మహిళా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఈ విషయాన్ని డోర్నకల్ రైల్వే జంక్షన్‌ను సందర్శించిన సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఆనంద్ భాటియాకు, డీఆర్‌యూసీసీ మెంబర్ మైను పాషా వినతి పత్రం అందించారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు తక్షణమే స్పందించి పాత కన్వెన్షన్ బోగీలతో సింగరేణి ప్యాసింజర్‌ను నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

1693
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles