ఉగాదికి సాగునీరు: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

Tue,March 13, 2018 09:02 PM

singireddy niranjan reddy visit peddamandadi in wanaparthy

పెద్దమందడి : ఉగాది పండుగకు పెద్దమందడి బ్రాంచ్ కెనాల్‌లో కృష్ణా నీటిని పారిస్తామని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లి గ్రామంలో పల్లెబస చేసిన అనంతరం గ్రామంలో పర్యటించారు. గ్రామ సమీపంలో వైరాల గుట్ట దగ్గర కెనాల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దమందడి మండలానికి సాగునీరు అందించేందుకు గతంలో మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో చేర్చలేదని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ ప్రభుత్వమే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టులో చేర్చి కెనాల్‌కు టెండర్లను పిలవడం జరిగిందన్నారు. ఏళ్లల్లో జరిగే పనులను నెలలలోనే పూర్తి చేసి రికార్డు స్థాయిలో నిలుస్తున్నామన్నారు. ఈ వేసవిలో మండలంలోని వీలైనన్ని గ్రామాల్లోని చెరువులను, కుంటలకు నింపుతామని భరోసా ఇచ్చారు.

1795
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS