సీఎం కేసీఆర్‌ను కలిసిన గాయని పి.సుశీల

Mon,January 4, 2016 04:12 PM

singer p susheela met with cm kcr

హైదరాబాద్: ప్రముఖ గాయని పి.సుశీల సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఆమె క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎం కుటుంబ సభ్యులను కలిశారు. ఐదు రోజులపాటు అయుత చండీ మహా యాగాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు సీఎంను సుశీల అభినందించారు. ప్రజల కోసం మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సుశీల దేశం గర్వించదగ్గ గాయని అని కొనియాడారు.

image

1886
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS