పుష్‌పుల్‌గా మారిన సింగరేణి రైలు

Mon,March 25, 2019 04:53 PM

Singareni Passenger replace push pull train from today

కొత్తగూడెం : బొగ్గు గని కార్మికులకే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు సింగరేణి రైలుతో ఎనలేని అనుబంధం కలిగి ఉంది. గత ఎనిమిది దశాబ్ధాల క్రితం సింగరేణి పేరుతో కొత్తగూడెం పట్టణంలో ఈ రైలు ప్రారంభమైంది. కాలక్రమేణ ఈ రైలు అన్నీ వర్గాల ప్రయాణీకులకు, ప్రయాణాలకు అనువుగా మారింది. ఉదయం నాలుగు గంటల నుంచే భద్రాచలం రోడ్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల సందడి మొదలవుతుంది. మొదట బొగ్గుతో నడిచిన ఈ రైలు, ఆ తర్వాత డీజిల్, ఆ తర్వాత విద్యుత్‌తో నడిచేస్థాయికి చేరుకుంది. కొత్తగూడెం బొగ్గు గని ప్రాంతం కావడం, ఇక్కడి బొగ్గు గని ప్రాంతాలను కలుపుకుంటూ పోవడం, ఆయా ప్రాంతాలలో బంధుగణం ఉండటంతో, తక్కువ చార్జితో అహ్లాదకర ప్రయాణం కావడంతో సింగరేణి రైలులోనే ప్రయాణించేందుకు ఈ ప్రాంతవాసులు ఎక్కువగా మక్కువ చూపుతారు.

14 బోగీలతో..
భద్రాచలం రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 5.45 గంటలకు ప్రారంభయ్యే ఈ రైలు మధ్యాహ్నం 1:00కు బల్లార్షా చేరుకుంటుంది. బొగ్గు గనులున్న ప్రాంతాలను కలుపుతూపోయేలా నాడు మార్గాన్ని రూపకల్పన చేశారు. కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, పెద్దపల్లి, కొమ్రంభీం కాగజ్‌నగర్ తదితర జిల్లాలను కలుపుకుంటూ వెళ్తోంది. గని కార్మికులకు ఈ రైలుతో విడదీయలేని అనుబంధం ఉందనే చెప్పాలి. 14బోగీలతో ప్రయాణీకులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తూ అందరికి బంధువుగా నిలిచింది.

నేటి నుంచి అమలు
సింగరేణి పేరుతో ఈ రైలు చాలా ప్రసిద్ధి చెందింది. కానీ ఈ రైలు స్థానంలో పుష్‌పుల్ ప్యాసింజర్‌గా ఈ రోజు నుంచి అమలులోకి రానుంది. ప్రస్తుతం ఉన్న 14కోచ్‌ల స్థానంలో 12 కోచ్‌లతో పుష్‌పుల్ నడవనుంది. సింగరేణి రైలుకు డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ కచ్చితంగా ఉండాలి. ఈ రైలు గమ్యస్థానంకు చేరుకున్న తర్వాత ఇంజిన్‌ను ఖచ్చితంగా మార్చుకోవాల్సిందే. సింగరేణి రైలులో ప్రతి కోచ్‌కు టాయిలెట్ సౌకర్యం ఉంటుంది. కానీ పుష్‌పుల్ ట్రైన్‌కు ఒక డ్రైవర్ ఉంటే చాలు. అసిస్టెంట్ డ్రైవర్ అసవరం లేదు. బటన్ నొక్కితే రైలు స్రార్టవుతుంది. బటన్ నొక్కితే ఆగిపోతుంది. రైలు గమ్యస్థానం చేరుకున్న తర్వాత ఇంజిన్‌ను మార్చాల్సిన అవసరం లేదు. రెండువైపులా ఇంజిన్‌తో కూడిన బోగీలు ఉంటాయి. ఫలితంగా సమయం ఆదా అవుతుంది. ప్రతి కోచ్‌కు రెండు టాయిలెట్ల సౌకర్యం మాత్రమే ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

2551
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles