సింగరేణి కార్మికుల శ్రేయస్సే ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నరు..

Tue,November 13, 2018 08:27 PM

Singareni coalmine laboure council members campaign in manchiryala

మంచిర్యాల : టీఆర్ఎస్ చెన్నూరు అభ్యర్థి బాల్క సుమన్ కు మద్దతుగా మంచిర్యాల జిల్లా మందమర్రిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావు మాట్లాడుతూ..సింగరేణిలో కారుణ్య నియామకాల ప్రక్రియ తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనన్నారు. సింగరేణి కార్మికుల శ్రేయస్సే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని స్పష్టం చేశారు. టీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

409
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles