యువకుడి ట్వీట్ గంటలో రిజల్ట్

Fri,March 29, 2019 10:45 AM

Siddipet Collector acts promptly in getting driving licence issued

చేర్యాల : నాలుగు నెలల సమస్యకు కలెక్టర్ ట్విట్టర్ ట్వీట్‌తో గంటలో పరిష్కారం లభించింది. చేర్యాల మండలం చిట్యాల గ్రామానికి చెందిన మేకల సహదేవులు జూన్‌లో ఎంవీఐ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే, లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సు ఇచ్చారు. పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్సు కోసం 20 డిసెంబర్ 2018 రోజున ఆర్టీఏ అధికారుల ముందు ట్రయల్ కొట్టాడు. అతనికి 60594 కౌంటరు నెంబర్ ఇచ్చారు. కానీ, ఇంత వరకు డ్రైవింగ్ లైసెన్సు ఇవ్వలేదు. ఆర్టీఏ కార్యాలయానికి వెళితే, రేపు, మాపు అంటూ కాలయాపన చేశారు. దీంతో విసుగెత్తిన సహదేవులు, మొత్తం వివరాలతో సిద్దిపేట కలెక్టర్‌కు ట్వీట్ చేశాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. వెంటనే స్పందించిన కలెక్టర్ కృష్ణభాస్కర్, ఆర్టీఏ జిల్లా అధికారి రామేశ్వర్‌రెడ్డికి ఫోన్ చేసి, సహదేవులుకు డ్రైవింగ్ లైసెన్సు జారీ చేయాలని, లైసెన్సు ఫొటోను తనకు గంటలో పంపాలని ఆదేశించారు. ఆర్టీఏ అధికారులు రంగంలోకి దిగి, గంటలోపు సహదేవులుకు డ్రైవింగ్ లైసెన్సు అందజేశారు. దీంతో సహదేవులు తీసుకున్న లైసెన్సుతో కలెక్టర్ రీట్వీట్ చేశారు. తన సమస్యను పరిష్కరించిన కలెక్టర్‌కు సహదేవులు కృతజ్ఞతలు తెలుపగా, ఈ విషయం సోషల్ మీడియాలో వైర‌ల్‌ అవుతున్నది.

4445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles