ముగ్గురు వైద్యులకు షోకాజ్

Sat,January 12, 2019 09:45 PM

show cause notices to three doctors in khammam

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్యులపై కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ వేటు వేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన వైద్యారోగ్యశాఖ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అశ్వారావుపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో కాంట్రాక్టు వైద్యుడిగా పనిచేస్తున్న మంగీలాల్‌ను టెర్మినేట్ చేయాలని ఆ శాఖ డీసీహెచ్‌ఎస్‌ను ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తాత్కాలికంగా డిప్యుటేషన్‌పై వెళ్లిన గైనకాలజిస్టు డాక్టర్ స్వాతి, పాల్వంచ ఆస్పత్రి మెడికల్ ఆఫీసర్ ముక్కంటేశ్వరావు, కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి కాంట్రాక్టు వైద్యురాలు ఐశ్వర్య విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గాను వారికి షోకాజ్ నోటీసులు అందజేశారు.

1893
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles