విధుల్లో నిర్లక్ష్యం.. సర్పంచ్, అధికారులకు షోకాజ్ నోటీసులు

Thu,September 19, 2019 08:10 PM

ఖమ్మం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక అమలులో నిర్లక్ష్యంగా వహించిన సర్పంచ్, ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ముదిగొండ మండలం న్యూలక్ష్మీపురం కస్తుర్బా పాఠశాలలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలో సమస్యలు, సౌకర్యాలపై విద్యార్థులను అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. అయితే పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ ప్రత్యేక అధికారిపై చర్యలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సర్పంచ్, ఇద్దరు అధికారులకు ఎంపీడీవో షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

2270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles