జయరాం హత్య కేసులో దర్యాప్తు వేగవంతం

Tue,February 12, 2019 10:19 AM

shikha chaudhary interrogate by police today

హైదరాబాద్‌ : ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం హత్య కేసు దర్యాప్తును జూబ్లీహిల్స్‌ పోలీసులు వేగవంతం చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు శిఖా చౌదరిని పోలీసులు విచారించనున్నారు. జయరాం హత్య కేసులో శిఖా చౌదరి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని జయరాం తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తర్వాత నందిగామలో మృతదేహాన్ని గుర్తించే వరకు దాదాపు 31 గంటల సమయంలో ఏం జరిగిందని ఆరా తీయనున్నారు పోలీసులు. ఈ సమయం కేసులో కీలకంగా మారనుంది. కృష్ణా జిల్లా పోలీసులు అరెస్టు చేసిన రాకేశ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ను నందిగామ కోర్టు అనుమతితో సోమవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. నిందితులను న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. నిందితులను వారం రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌.. ఇవాళ విచారణకు వచ్చే అవకాశం ఉంది. తన మేనమామ జయరాం హత్య కేసుతో తనకెలాంటి సంబంధం లేదని శిఖా చౌదరి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

1424
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles