వికారాబాద్ లో గొర్రెలు పంపిణీ చేసిన మంత్రి మహేందర్ రెడ్డి

Tue,June 20, 2017 02:42 PM

sheeps distributed in vikarabad district


వికారాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా మంత్రి మహేందర్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలోని బొమ్మరాస్ పేట మండలం నాస్కాన్ పల్లి లో లబ్దిదారులకు గొర్రెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కుల వృత్తులను భారీ బడ్జెట్ తో ఆదుకుంటుందని తెలిపారు. వికారాబాద్ జిల్లాలో 20 వేల 400 మందికి గొర్రెలను అందిస్తున్నట్లు వెల్లడించారు. తొలి విడతగా రూ.21 కోట్లతో 10,054 మంది కుర్మ, యాదవులతో గొర్రెల పెంపకం చేపడతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నూతన పారిశ్రామిక విధానం వంటి కార్యక్రమాలు అభివృద్ధి కి నాంది పలుకుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డితోపాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.
sheeps-vkbd1

1530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles