గొర్రెల పంపిణీ దేశానికే గొప్ప సూచిక : హరీష్‌రావు

Tue,June 20, 2017 01:01 PM

Sheep distribution is great symbol to country, says Harish Rao

సిద్ధిపేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకం దేశానికే గొప్ప సూచిక కాబోతుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. కొండపాకలో ఏర్పాటు చేసిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో హరీష్‌రావు మాట్లాడారు. ఒక కొత్త రాష్ట్రం సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఇవాళ కొండపాకలో బీరప్ప పండుగ వాతావరణం నెలకొంది అని పేర్కొన్నారు. గొల్లకురుమలకు కొండపాకలో గొర్రెలు పంపిణీ చేయడం సంతోషాన్నిస్తుందన్నారు. ఈ విషయంలో కొండపాక ప్రజలు అదృష్టవంతులు అని తెలిపారు. రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని స్పష్టం చేశారు. అభివృద్ధి అంటే పట్టణాలు, పరిశ్రమలే కాదు.. గ్రామాల ఆర్థిక పరిపుష్టి కూడా అభివృద్ధే అని చెప్పారు. గ్రామాల్లో కులవృత్తులను గుర్తించి బలోపేతం చేస్తున్నామని తెలిపారు. గతంలో పల్లె కన్నీరు పెడుతోంది అనేట్లు ఉండే గ్రామాల పరిస్థితి.. ప్రస్తుతం పల్లె పన్నీరు చల్లుతోంది అనేస్థాయికి చేరుకోబోతున్నామని పేర్కొన్నారు. పల్లెల్లో రెప్పపాటు కరెంట్ పోకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని చెప్పారు. మిషన్ కాకతీయతో చెరువుల్లోకి నీరు రావడంతో చెరువులు కళకళలాడుతున్నాయన్నారు.

995
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles