HomeLATEST NEWSShe teams arrested criminals who molesting womens

మొహం మీద సిగరేట్ పొగ ఊది...భర్త ముందే వేధించి..

Published: Mon,September 17, 2018 06:42 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

హైదరాబాద్ : మొహం మీద సిగరేట్ పొగను ఊదారు...భర్త ముందే నడిరోడ్డుపై వేధించారు.. మరో ఘటనలో యువతిని నమ్మించి రూమ్‌కు తీసుకువెళ్లాడు...వివస్త్రను చేసి ఫొటోలు తీశాడు...చివరకు బాధితురాళ్లు షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో పోకిరీలు జైలు పాలైయ్యారు. ఈ విధంగా సెప్టెంబర్ నెలలోని 15 రోజుల్లో షీ టీమ్స్ వివిధ ఫిర్యాదులపై మొత్తం 26 కేసులను నమోదు చేసింది. అందులో 16 సంఘటనలపై ఎఫ్‌ఐఆర్‌లు, 8 ఫిర్యాదులపై పెట్టీ కేసులు, 2 కౌన్సెలింగ్ కేసుల్లో అభియోగాలు మోపారు. మొత్తం 30 మందికి రాచకొండ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. మరో 30 మందిని షీ టీమ్స్ డెకాయ్ ఆపరేషన్‌ల ద్వారా హాట్‌స్పాట్స్‌ల్లో వెకిలి చేష్టలు చేసిన వారిని అదుపులోకి తీసుకుని కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇందులో ఆరుగు మైనర్లు కూడా ఉన్నారు.

సిగరేట్ పొగ ఊదారు...చితక కొట్టారు


నేరేడ్‌మెట్‌కు చెందిన దంపతులు ఈ నెల 9న రాత్రి సమయం లో సఫిల్‌గూడ ప్రాంతంలో ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లారు. భోజనం పూర్తి చేసుకుని రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళ్తుండగా సాయినాథ్‌పురం వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వారిని అడ్డగించారు. సిగరేట్ పొగను మహిళపై ఊది... నిలదీసిన భర్తపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆ మహిళ గుర్తు తెలియని వ్యక్తులు వచ్చిన బైక్ నంబర్ ఆధారంగా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితులు సయ్యద్ అహ్మాద్, మధులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇం దులో సయ్యద్ అహ్మద్ టీ స్టాల్ నిర్వహిస్తుండగా, మధు విద్యార్థిగా తేలింది.

వివస్త్రను చేసి ఫొటోలు తీశాడు...


మేడ్చల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువతి మాదాపూర్ ప్రాంతంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తుంది. ఈ సమయంలో ఆమెకు మోహన్ ప్రసాద్ పరిచయమయ్యాడు. ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. మార్చిలో మోహన్ యువతిని తన గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను వివస్త్రను చేసి ఫొటోలు తీశాడు. అలా ఆ ఫొటోలను చూపించి.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నాడు. అతని వేధింపులు తట్టుకోలేక ఉద్యోగాన్ని మాదాపూర్ నుంచి పోచారంకు బదిలీ చేసుకుంది. అయినా మోహన్ ప్రసాద్ ఆమె వెంటపడుతూనే ఉన్నాడు. ఇటీవల పోచారంలోని కంపెనీ వద్దకు వెళ్లి బెదిరించాడు. అలాగే అభ్యంతకరంగా ఉన్న ఆమె ఫొటోలను వాట్సాప్‌కు పంపాడు. దీంతో ఆందోళనకు గురైన ఆ యువతి షీ టీమ్స్‌ను ఆశ్రయించడంతో ... పోలీసులు మోహన్ ప్రసాద్‌ను అరెస్ట్ చేశారు. ఇలాంటి ఈవ్‌టీజర్లు, కామాంధుల భరతం పట్టేందుకు...బాధిత యువతులు, మహిళలు రాచకొండ వాట్సాప్ 9490617111 లేదా డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సీపీ మహేశ్ భగవత్ కోరుతున్నారు.

11628
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology