శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న శరత్ మృతదేహం

Wed,July 11, 2018 11:34 PM

sharat dead body reached hyderabad

హైదరాబాద్: అమెరికాలోని కన్సాస్ రెస్టారెంట్‌లో ఓ దుండగుడి కాల్పుల్లో వరంగల్‌కు చెందిన విద్యార్థి కొప్పు శరత్ గత శనివారం సాయంత్రం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక.. శరత్ మృతదేహాన్ని తెలంగాణకు తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి అధికారులతో మాట్లాడి అన్ని ఏర్పాట్లను చేసింది. దీంతో శరత్ మృతదేహం ఇవాళ రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నది. శరత్ మృతదేహానికి ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు నరేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు, సైబరాబాద్ సీపీ సజ్జనార్ నివాళులర్పించారు. కాసేపట్లో శరత్ మృతదేహాన్ని వరంగల్‌కు తరలించనున్నారు.

1678
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS